కర్నూలు(సెంట్రల్) : కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లైనా విద్యారంగానికి చేసిన మేలు శూన్య మని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు అన్నారు. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలులో నిర్వహించే ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్లను బుధవారం సీఆర్ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సమస్యలపై పోరాట పటిమ తగ్గిపోతుందన్నారు. అందువల్ల అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్ష ణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జీఓ నంబర్ 77ను రద్దు చేస్తామని మంత్రిలోకేష్ చెప్పి ఇప్పటి వరకు చేయలేదన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఇంత వరకు విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్‌బాషా పాల్గొన్నారు.


