కర్నూలు (టౌన్): పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా సోమవారం కర్నూలు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలో భాగంగా కర్నూలులోని ప్రభుత్వ ప్రెస్ దగ్గర నుంచి ఆర్‌డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం వినతిపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజీల్ ధరలు ఉన్నాయని తెలిపారు. నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


