హొళగుంద: బుకింగ్ చేసి 45 రోజులైనా గ్యాస్ సిలిండర్ రాకపోవడంతో ప్రజలు ఆదివారం నిరసన తెలిపారు. హొళగుందలో పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన హొళగుందకు వివిధ పల్లెల నుంచి గ్యాస్ సిలిండర్లను తీసుకుని ఆదివారం ఉదయమే వచ్చారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లను క్యూలో ఉంచి గంటల తరబడి ఎదురు చూశారు. నిర్వాహకులు ఆలస్యంగా గ్యాస్ బండి రాదని చెప్పడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే నిరసన తెలిపారు. గత నెలన్నర్ర నుంచి ఇబ్బంది పడుతున్నామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌లో అమ్ముకునే వారికి ముందుగా అందిస్తున్నారని ఆరోపించారు. సోమవారం కర్నూలుకు వెళ్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఖాళీ గ్యాస్ సిలిండర్లను తీసుకుని స్వగ్రామాలకు వెళ్లారు.


