ఉయ్యాలవాడ: మండలంలోని తుడమలదిన్నె గ్రామానికి చెందిన ఇమ్రాన్‌పై జరిగిన దాడిని ఆదివారం హత్యాయత్నం కేసుగా పోలీసులు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఇదే గ్రామానికి ఒక యువ తి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ యువతి బంధువులు బోయ వెంకటస్వామి, నిఖిల్, మోక్షాజ్ఞాన్, సాయి వరణ్, పాణ్యం మణివర్ధన్ శనివారం రాత్రి ఇమ్రాన్ మాయలూరు వెళ్తుండగా వెంటపడి రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కోవెలకుంట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రా న్ నుంచి వివరాలు సేకరించారు. ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. గ్రామంలో ముందస్తుగా శిరివెళ్ల సీఐ రాము, రేవనూరు, ఉయ్యాలవాడ ఎస్‌ఐలు ధనుంజయులు, రామిరెడ్డి, ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.


