ఐదేళ్లుగా జిల్లాలో డెంగీ కేసులు
కేసులు కేసులు
కర్నూలు నగరంలోని శ్రీ పూరి జగన్నాథ మందిరంలో ఆదివారం మామిడి పండ్ల ఉత్సవం వైభవో పేతంగా జరిగింది. శీల ప్రభు పాదుల ప్రేమ విందు, భగవద్గీత తరగతులు నిర్వహించారు. మామిడి పండ్ల ఉత్సవంలో భాగంగా జగన్నాథ్, సుభద్ర, బలదేవ్‌లను ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు తెచ్చిన వివిధ రకాల మామిడి పండ్లతో జగన్నాథ్‌కు రాజ భోగ నివేదన చేశారు. ఇస్కాన్ కర్నూలు బాధ్యులు రఘునందన సేవక్ ప్రభు సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరు ఆఽధ్యాత్మిక సేవా గుణం కలిగి ఉండాలన్నారు. – కర్నూలు కల్చరల్
కర్నూలు(హాస్పిటల్): డెంగీ జ్వరం పేరు చెబితేనే అందరికీ వణుకుపుడుతోంది. ఈ జ్వరం వచ్చిందంటే చాలు నిలువెత్తు మనిషిని నిలువునా కూలిపోయి రోజుల పాటు మంచాన పడతాడు. చిన్నదోమ కుడితే వచ్చే ఈ జ్వరంతో బాధపడే వ్యక్తులతో జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గుతుంటే రోగుల సహాయకుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. ఎలాగైనా రోగిని ప్రాణాలతో దక్కించుకోవాలని అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే అదునుగా సాధారణ జ్వరానికి సైతం కొందరు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డెంగీ పేరుతో రోగులను దోచుకుంటున్నాయి. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులలో ఏరియా ఆసుపత్రులు, 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు 400లకు పైగా నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో సాధారణ జ్వరాలకు చికిత్స అందిస్తున్నారు. డెంగీ లాంటి జ్వరాలు వస్తే జిల్లా కేంద్రంలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వైద్యులు ముందుగా ర్యాపిడ్ పరీక్ష చేయిస్తున్నారు. అందులో డెంగీగా నిర్ధారణ అయితే వెంటనే రక్తకణాల పరీక్షలు చేస్తున్నారు. కణాల సంఖ్య తక్కువగా ఉంటే రక్తం, ప్లేట్‌లెట్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఇటీవల కాలంలో నిత్యం ప్రతి ఆసుపత్రిలో కనిపిస్తున్నాయి. ఈ మధ్యన సగటున ప్రతి ఆసుపత్రిలో ఒకరు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు.
ఏటా పెరుగుతున్న డెంగీ కేసులు
జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 625 మందికి డెంగీ జ్వర లక్షణాలు ఉండగా వారికి పరీక్ష చేయడంతో 83 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఏటా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేస్తే అందులో 10 శాతం కూడా డెంగీగా నిర్ధారణ చేయడం లేదు. వాస్తవంగా చూస్తే డెంగీ బాధితుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాని చెప్పారు. డెంగీ కేసులు అధికంగా చూపితే అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రైవేటు ఆసుపత్రుల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగీ కేసు రాపిడ్ పరీక్షలో నిర్ధారణ కాగానే వ్యాధి లక్షణాలకు తగ్గట్లు చికిత్స ఇచ్చి రోగికి నయం చేసి పంపిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో ప్లేట్‌లెట్‌లు తీసుకున్న వారి జాబితా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు.
ఆదోని డివిజన్‌లో అధికం
జిల్లాలోని మూడు డివిజన్ల కంటే ఆదోని డివిజన్‌లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 625 డెంగీ లక్షణాలతో చికిత్స తీసుకోగా వారికి రక్తపరీక్షలు చేయగా 83 మందికి డెంగీ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ఇందులో కర్నూలు డివిజన్‌లో 210 అనుమానితులకు గాను 26 మందికి పాజిటివ్, పత్తికొండ డివిజన్‌లో 113 మందికి గాను 16మందికి, ఆదోని డివిజన్‌లో 302 మందికి గాను 41 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఒకవైపు మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుండగా మరోవైపు డెంగీ జ్వరాలు ప్రతి సంవత్సరం పెరుగుతుండటం అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నాం. ఈ మేరకు డెంగీ కారక ఏడిస్ ఈజిప్టై దోమలు పెరగకుండా జాగ్రత్తలు సూచిస్తున్నాం. డెంగీ కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాం. నీరు నిలిచిన చోట యాంటి లార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమల నివారణకు మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో ఫాగింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. – టి.వెంకటేశ్వర్లు,
జిల్లా మలేరియా అధికారి, కర్నూలు
వైభవంగా శ్రీశైలేశుడి పల్లకోత్సవం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివారం స్వామి అమ్మవార్ల పల్లకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) ఈ ఉత్సవం జరుపుతారు. పల్లకోత్సవంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పం పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ను పల్లకీలో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు నిర్వహించారు.
సంవత్సరం అనుమానిత నిర్ధారణ
2022 4,088 342
2023 2,484 409
2024 2,220 306
2025 3,546 467
2026 625 83
ఇప్పటివరకు
( 20025లో డెంగీతో ఇద్దరు
మరణించారు)
ఏటా పెరుగుతున్న కేసులు
2024లో 306 కేసుల నమోదు
గత ఏడాది 467కు చేరిక
ఈ ఏడాది ఇప్పటికే 83 కేసులు నమోదు
ఆదోని డివిజన్‌లో అధికం
గ్రామాలు, పట్టణాల్లో
లోపించిన పారిశుద్ధ్యం
అవగాహన కల్పించని వైద్య సిబ్బంది
తూతూమంత్రంగా చర్యలు
అధ్వానంగా పారిశుద్ధ్యం
కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా, ప్రతి నెలా మూడవ శనివారం వరకే ఆ కార్యక్రమం పరిమితం అవుతోంది. మిగిలిన రోజుల్లో పారిశుధ్యం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ముఖ్యంగా మురుగుకాలువల్లో నీరు నిల్వ ఉండటం, మురికివాడలు, గ్రామాల్లో ప్రజలు తాగునీటిని నీటి తొట్లలో నిల్వ ఉంచుకుని, వాటిని వారం వారం శుభ్రం చేసుకోకపోవడంతో డెంగీ దోమలు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ వారు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


