కర్నూలు(అర్బన్): జిల్లాలో పల్లె పండుగ 2.0 కింద చేపట్టిన పనులను మరోసారి పరిశీలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. తక్కువ సమయంలో అధిక పనులను మంజూరు చేయడం, వేగంగా వాటిని పూర్తి చేయడంతో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, డ్వామా ఏపీడీలు సంయక్తంగా ఆయా పనులను పరిశీలిస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ క్లస్టర్లలో 25 శాతం పనులను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు క్లస్టర్ల పరిధిలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ప నులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. పరిశీలనకు సంబంధించిన నివేదికలను ఈ నెలాఖరు నాటికి జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయనున్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో జిల్లాలో రూ.119.20 కోట్లతో 1,131 పనులను చేపట్టారు. ఆయా గ్రామా ల్లో మొత్తం 160 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్లు వేయాలనేది లక్ష్యం. ప్రస్తుతం జరుగతున్న పరిశీలన పూర్తి అయిన అనంతరం ఆయా రోడ్లను పీఆర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు తనిఖీ చేయనున్నారు.


