మద్దతు ధరలపై కేంద్రం పునరాలోచన చేయాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరలపై కేంద్రం పునరాలోచన చేయాలి

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

చిప్పగిరి: పంటల మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కోరారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది ధరలతో పోలిస్తే మూడు నుంచి ఏడు శాతం మాత్రమే మద్దతు ధరలు పెంచడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పెట్టుబడులను పరిగణనలోకి తీసుకొని మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, పంటల మద్దతుధరలో ఏపీకి ప్రత్యేక వెసులుబాటు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement