మత్స్యానందం
మండే ఎండాకాలంలో పాణ్యంలోని ఊరుముందరి చెరువులో చేపల వేటకు మత్స్యకారులు పోటీ పడ్డారు. చెరువులో ముందుగానే వేసిన వలలను గురువారం వాటిని ప్రయాసతో బయటకు తీశారు. గడ్డిమోసు, వాల్గా, బొచ్చ, జిలేబీ తదితర చేపలు దొరకడంతో వాటిని అమ్మకానికి ఉంచగా కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు వచ్చారు. మరో రెండు రోజుల్లో చేపలు పట్టే ప్రక్రియ పూర్తి అవుతుందని మత్స్యకారులు తెలిపారు. –పాణ్యం
● హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసల్ ఆజాం, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం
రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ ఖాన్ వెల్లడి
ఎగుమతి చేసేందుకు సిద్ధం..
కర్నూలు(టౌన్): తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ కడప ఘటనను రాజకీయం చేస్తున్నాడని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలులోని తన స్వగృహంలో హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసల్ ఆజాంతో కలిసి హఫీజ్‌ఖాన్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప అల్లర్లు డైవర్షన్ చేసి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై నెట్టాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్వార్థ రాజకీయాలతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కుట్రలు చేస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందేందుకే ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఎప్పటికీ పేద లు, బడుగు, బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసల్ ఆజాం మాట్లాడుతూ గత వారం కడపలో జరిగిన అల్లర్లకు కూటమి నేతలే కారణమన్నారు. కేవలం అల్మాస్ సర్కిల్ పేరు మార్పు కోసమే ఈ వివాదం చోటు చేసుకుందన్నారు. అల్మాస్ పేట సర్కిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పేరు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. అయితే టిప్పు సుల్తాన్ సర్కిల్ కోరిన వారికి చంద్రబాబు మద్దతు ఇచ్చారన్నారు. సర్కిల్ పేరు మార్పులో తెలుగుదేశం పార్టీ నేతల తీరు వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకుందన్నారు. హిందూ సోదరులు హనుమాన్ సర్కిల్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారని, అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమై వైఎస్సార్‌సీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎటువంటి మతపరమైన రాజకీయాలు చేయదన్నారు.


