నార్కోటిక్ డ్రగ్స్ (మత్తును కలిగించే ఔషధాలు) వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం నేరం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వాటి విక్రయాలపై నిఘా ఉంచాము. నిద్ర, ఆందోళన, డిప్రెషన్ సమస్యలకు రెగ్యులర్‌గా మందులు వాడుతున్న వారు తాజాగా డాక్టర్ రాసిన చీటిని తీసుకొచ్చి మందుల దుకాణాల్లో చూపించి కొనుగోలు చేయాలి. అది కూడా ప్రిస్కిప్షన్‌లో వైద్యులు సూచించిన మాత్రలు మాత్రమే విక్రయించాలి.
–హరిహరతేజ, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషద నియంత్రణ శాఖ, కర్నూలు


