శ్రీశైలం ప్రాజెక్టు: హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సున్నిపెంటలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. చెంచు గిరిజనుల ఆరాధ్య దైవమైన బయన్న స్వామి ఆలయంలో 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పీఠాధిపతి శివరుద్ర స్వామి, వేద పండితులు చందు స్వామి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అంతిరెడ్డి అరవింద రెడ్డి ఆధ్వర్యంలో బయన్న స్వామి ఉత్సవాల సందర్భంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బయన్న స్వామి ఆలయ నిర్వాహకులు కుడుముల మూగెన్న, సామాజిక సేవకుడు వట్టి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


