‘గుండు’రగండులు | - | Sakshi
Sakshi News home page

‘గుండు’రగండులు

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

ట్టణంలోని సయ్యద్‌ అల్లాబకాష్‌ వలీ ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 130 కేజీల గుండు, ఇసుక సంచి, 75 కేజీల చంద పందెం పోటీలు అలరించాయి. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ పోటీలకు యువకులు పోటా పోటీగా పోటీపడి గుండు, ఇసుక, చందలను ఎత్తారు. ఇందులో ప్యాపిలి మండలం గోసానిపల్లెకు చెందిన చందు గుండు పందెంలో ప్రథమ, వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి సుధాకర్‌ ద్వితీయ, ఇసుక సంచి పందెంలో సుధాకర్‌ ప్రథమ, చందు ద్వితీయ, చంద పందెంలో పుల్లగుమ్మి సుధాకర్‌, శివలు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతలకు నిర్వాహకులు వెండి పఽతకాలు బహూకరించారు. యువకుల ఈలలు, కేరింతల మధ్య అత్యంత ఉత్సహభరితంగా పోటీలు అలరించాయి. గుండు, ఇసుక, చంద పందాలలో ప్యాపిలి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారే విజేతలుగా నిలవడం విశేషం. కార్యక్రమంలో నిర్వాహకులు ఖాజా, రాజ, ఇమామ్‌ హుసేన్‌, ఫైల్‌మాన్‌ పాల్గొన్నారు. – బేతంచెర్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement