వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య

Mar 26 2026 7:30 AM | Updated on Mar 26 2026 7:30 AM

బనగానపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని డోన్‌కు చెందిన మేరీ భర్త విల్సన్‌ (32)ను ప్రియుడు మధుతో కలిసి ఈ నెల 15న రాత్రి హత్య చేసినట్లు బనగానపల్లె రూరల్‌ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. నిందితులు మేరీ, మధు, వీరికి సహకరించిన నంద్యాలకు చెందిన మహమ్మద్‌, అశోక్‌ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు పంపారు. కేసు వివరాలను బుధవారం స్థానిక కార్యాలయంలో సీఐ వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం నంద్యాలకు చెందిన మేరీకి డోన్‌కు చెందిన విల్సన్‌తో వివాహం జరిగింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి పదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం వీరి కుటుంబం డోన్‌ నుంచి నంద్యాలలోని బోగ్గులైన్‌కు మారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ స్థితిలో మూడు నెలల క్రితం నంద్యాల మండలం బాపూజీ నగర్‌కు చెందిన మధుతో మేరికి వివాహేతర సంబంధం ఏర్పడగా వారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు మేరీ ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఈ నెల 15న మధు, అతని స్నేహితులు రఫీ, అశోక్‌ కలిసి విల్సన్‌కు అతిగా మద్యం తాగించారు. ఆటోలో బనగానపల్లె నుంచి కై పకు వెళ్లే రహదారిలో ప్లాట్లలోకి తీసుకెళ్లి బెల్టుతో విల్సన్‌ మెడకు బిగించి హత్య చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు హంతకుల గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 24న కై ప వీఆర్‌ఓ ద్వారా లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement