● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): ప్రజలకు అందించే ఉత్తమ సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్‌లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించి నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ యాజమా న్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారి అభీష్టం మేరకే వారు కోరుకున్న ప్రాంతాల్లో నియమిచామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో మృతి చెందితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు. ఆఫీసు సబార్డినేట్‌గా ఉద్యోగాలు పొందిన ఎస్ గణేష్ (ఎంపీపీ ఆళ్లగడ్డ), ఆర్ నరేంద్రకుమార్ (ఎంపీపీ కల్లూరు), వీ అభిషేక్ (ఎంపీపీ కౌతాళం)కు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


