పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Mar 29 2026 7:01 AM | Updated on Mar 29 2026 7:01 AM

నందవరం: ఆర్టీసీ బస్సు అదు పు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. నందవరం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలదిన్నె నుంచి ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరుకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నందవరం గ్రామం దాటిన తరువాత బస్సు స్టీరింగ్‌ వీల్‌ పనిచేయకపోవడంతో డ్రై వర్‌ కాశీం పొలాల్లోకి మళ్లించాడు. ప్రధాన రహదారిలో చింత చెట్టు స్వల్పంగా ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సులు నడుపుడుతుడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం కండిషన్‌ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

యాగంటి సందర్శన

బనగానపల్లె: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ చైర్మన్‌ బండి మౌళీశ్వరరెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏక శిలా రూపంలో కొలువైన ఉమా మహేశ్వరస్వామికి అభిషేకం అర్చన తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎస్పీ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ చైర్మన్‌ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement