అరటి రైతు ఆశలు మట్టిపాలు | - | Sakshi
Sakshi News home page

అరటి రైతు ఆశలు మట్టిపాలు

Mar 29 2026 7:01 AM | Updated on Mar 29 2026 7:01 AM

కృష్ణగిరి: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి అరటి రైతు ఆశలు మట్టిపాలయ్యా యి. గాలీవానకు అరటి తోటలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది. కృష్ణగిరి మండలం బాపనదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల రామాంజినేయులకు 10 ఎకరాల్లో అరటి తోటలు ఉన్నాయి. పెట్టుబడుల రూపేణ రూ.20 లక్షలు సాగు చేయగా ఇటీవల గెలలు కూడా వచ్చాయి. తన కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశించిన ఆ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోగా, వడగండ్ల వర్షానికి పంట చాలా వరకూ నేలమట్టమయ్యింది. తమ గోడు పట్టించుకునే వారెవ్వరని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి తగిన న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యణే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement