ఆలూరు: అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మర్చారని అధికారంలోకి రాక ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తుందేమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో రూ 3.31 లక్షల కోట్ల అప్పులు చేశారని, చంద్రబాబు నేడు ఏకంగా రూ 3.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో శనివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాల్పడకుండా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి మునెప్ప తదితరులు పాల్గొన్నారు.
● మొక్కజొన్న, ఉల్లి పంటలకు అంతంతమాత్రం ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇటీవలి వరకు మురిపించిన వేరుశనగ ధర నేల చూపులు చూస్తోంది. శనివారం మార్కెట్‌కు వేరుశనగ 2,047 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.4,682, గరిష్ట ధర రూ.8,340 లభించగా.. సగటు ధర రూ.6,899 నమోదైంది.
● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400. మార్కెట్‌లో మాత్రం కనిష్ట ధర రూ.1,430, గరిష్ట ధర రూ.1,760 లభించగా.. సగటు ధర రూ.1,739 నమోదైంది.
● కందుల ధర పడిపోతుండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కనిష్ట ధర రూ.3,270, గరిష్ట ధర రూ.7,669 లభించగా.. సగటు ధర రూ.7,547 పలికింది.
● ఉల్లిగడ్డల ధర దయనీయంగా ఉంది. మార్కెట్‌కు 2,371 క్వింటాళ్లు రాగా.. లభించిన ధర రూ.220 మాత్రమే. గరిష్ట ధర రూ.1,119 పలికినా ఎక్కువ మంది రైతులకు రూ.220 నుంచి రూ.500లోపే ధరలు లభించడం గమనార్హం.
● మార్కెట్‌లో మిర్చి ధర అంతంతమాత్రమే. బ్యాడిగ రకం మిర్చికి గరిష్టంగా లభించిన ధర రూ.23,786 మాత్రమే. మిగిలిన రకాలకు ధర నామమాత్రంగానే ఉంది.


