● రూ.6 లక్షల ఆస్తి నష్టం
గోనెగండ్ల: వేముగోడు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున ఓ గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన మంగళి వెంకటేష్‌కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నా రు. అయితే వెంకటేష్ ఉపాధి నిమి త్తం కుటుంబంతో కలిసి గత ఆరు నెలలుగా కర్నూలులో నివాసముంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవారు. సోమవారం తెల్లవారు జామున అతని గుడిసె దగ్ధమైంది. బీరువాలో భద్రపరిచిన రూ.2 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, పది ప్యాకెట్ల బియ్యం, వంట సామగ్రితో పాటు బట్టలు ఇతర వస్తువులు కాలిపోయాయని, దీంతో మొత్తం దాదాపు రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పు పెట్టాటని ఆరోపిస్తున్నాడు. గుడిసెకు నిప్పంటించిన వ్యక్తిపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెంకటేష్ తెలిపారు.
నాపరాళ్ల ట్రాక్టర్
బోల్తా
● బండలు మీద పడి
వ్యక్తి దుర్మరణం
కృష్ణగిరి: ఎరుకల చెరువు గ్రామ సమీపంలో సోమవారం ఉద యం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన బురిడి ప్రసాద్(32), బి. మధు కలసి ఆర్డర్‌పై ఎరుకలచెరువు, పి. కోటకొండ గ్రామాలకు నాప రాళ్ల బండలను ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. మార్గమధ్యలో ఎరుకల చెరువుకు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీపై పడుకున్న బుడిగి ప్రసాద్ నాపరాళ్ల బండల కింద పడిపోయాడు. రహదారి వెంట గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జేసీబీతో నాప రాళ్ల బండలను తొలగించారు. అప్పటికే ప్రసాద్ మృతి చెందా డు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. మృతుని భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


