● నిడ్జూరు టీడీపీ నాయకుడిపై
జేసీకి సర్పంచ్ ఫిర్యాదు
కర్నూలు(సెంట్రల్): కర్నూలు రూరల్ మండలం నిడ్జూరులో ప్రభుత్వ నిధులతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యప్రకాష్ తన ఇంటి కంపౌండ్ నుంచి సీసీ రోడ్డు, మురుగు కాల్వ వేయించుకుంటున్నారని, తక్షణమే ఆ పనులను రద్దు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ మాధవి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఆయనే నేరుగా తన ఇంటి కంపౌండ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేయించుకుంటు న్నారని, గ్రామంలో పలు కాలనీల్లో గుంతలమయం అయిన రోడ్లు ఉన్నాయని, వాటిలో సీసీ రోడ్డు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్షణమే ఆ పననులను రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


