జీడీడీపీ లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

జీడీడీపీ లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ

Mar 21 2026 4:58 AM | Updated on Mar 21 2026 4:58 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి

కర్నూలు(సెంట్రల్‌): జీడీడీపీ(గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డోమెస్టిక్‌ ప్రొడక్ట్‌)లక్ష్యాల సాధనకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందచుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీడీపీ లక్ష్యాల సాధనపై శుక్రవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని రెట్టింపు పనితీరు రాబట్టేలా పనిచేయాలన్నారు. జీడీడీపీ లక్ష్యాల సాధన కోసం అన్ని నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో తలసరి ఆదాయం పెంపు దిశగా ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఉత్పాదకత పెంపు ద్వారా జీడీడీపీ ఉందని తెలిపారు. ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలిగేలా విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఓ భారతి, ఐసీడీఎస్‌పీడీ విజయ, డీసీహెచ్‌ఎస్‌ జఫ్రూళ్ల, ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ దీప్తి, డీఈఓ సుధాకర్‌, డీటీఓ రామచంద్రరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement