శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దడల ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్ఠి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ బాషణ చేశారు.


