డోన్ రూరల్: వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సుభాన్ స్వగృహంలో బుధవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట ముస్లిం మైనారిటీ నాయకులు అక్బర్ బాషా, పాతపేట అబ్దులా, రియాజ్, ఫరెస్ట్ మౌలాలి, మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మెన్ జాకిర్ హుసేన్, ప్యాపిలి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, ఎద్దుపెంట మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, పారిశ్రామికవేత్తలు ప్రశాంత్, క్వాలిటీ అబ్దులా పాల్గొన్నారు.


