టీటీడీ చైర్మన్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ రాజీనామా చేయాలి

Mar 18 2026 7:47 AM | Updated on Mar 18 2026 7:47 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కల్లూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి, అక్రమ అరెస్టు ను ఖండిస్తూ కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని కల్లూ రు అర్బన్‌ ఇందిరమ్మ కట్ట దగ్గర ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, చంద్రబాబు ప్రజలకు శ్రీరంగ నీతు లు చెప్పి వారు మాత్రం అచరించరని విమర్శించారు. చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఓ మహిళతో కామ క్రీడలు నిర్వహిస్తే దానిని తప్పు అని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తే కూటమి ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోకుండా వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్‌ నాయు డు తీరును వ్యతిరేకిస్తూ తిరుపతిలో శాంతియుత నిరసన తెలియజేస్తున్న మహిళలపై టీడీపీ గూండాలతో దాడి చేయించి, అనంతరం పోలీసు కేసులు పెట్టడం దారుణమన్నారు. మహిళ తో ఉన్న వీడియోలో బీఆర్‌ నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. ఆ వీడియోను టీడీపీ నాయకులు ఫేక్‌ అని, దాంట్లో తప్పేముందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు చేతకానితనంతోనే బీఆర్‌ నాయుడుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలకు అనర్హులని విమర్శించారు. టీటీడీ చైర్మన్‌గా భక్తి భావంతో ఉండేవారిని నియమించాలన్నారు. కూటమి ప్రభుత్వం, నాయకుల తప్పులను ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించా రు. టీడీపీ ఎంపీ డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఆరో పించారు. బీఆర్‌ నాయుడుని తొలగించి, తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రతిష్టతను దిగజార్చే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నర సింహులు, సాన శ్రీనివాసులు, లక్ష్మీకాంతరెడ్డి, నాగ లక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, మిద్దె చిట్టెమ్మ, అరుణ, గాజుల శ్వేతారెడ్డి, నాయకులు రంగప్ప, చిన్న, మీదివేముల ప్రభా కర్‌రెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, గోపాల్‌రెడ్డి, పెద్దపాడు శ్రీధర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, బాలచంద్రారెడ్డి, హేమలత, శివారెడ్డి, సత్యంరెడ్డి, సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement