పండుగకు వచ్చి అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

పండుగకు వచ్చి అనంతలోకాలకు

Mar 18 2026 7:47 AM | Updated on Mar 18 2026 7:47 AM

గోనెగండ్లలో విషాదం

బైక్‌ను ఢీకొన్న లారీ

ఇద్దరు దుర్మరణం

గోనెగండ్ల: ఉగాది పండుగ కోసం ఊరికొచ్చిన కొన్ని గంటల్లోనే రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. గోనెగండ్లలో లారీ– బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లలోని మొట్టివీధికు చెందిన మద్దక్క, అచ్చమ్మ కుటుంబాలు స్థానికంగా పనులు లేకపోవడంతో రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం తెలంగాణకు వలసవెళ్లాయి. ఈనెల 19న ఉగాది పండుగ ఉండటంతో మంగళవారం తెల్లవారుజామున వారు సొంతూరుకు వచ్చారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికి సరుకుల కోసం మద్దక్క కుమారుడు మునిస్వామి (31), అచ్చమ్మ కుమారుడు మొండి వీరేష్‌ (17) బైక్‌పై గంజిహళ్లి రోడ్డు నుంచి బస్టాండ్‌ దగ్గరకు వెళ్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి అతివేగంగా వస్తున్న లారీ గోనెగండ్ల హైస్కుల్‌ సమీపంలో వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైర్‌ కింద పడిపోయిన మునిస్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానికులు అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ చంద్రబాబు దర్యాప్తు చేపట్టారు. మునిస్వామికి భార్య సిమ్రాన్‌, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. అచ్చమ్మకు వీరేష్‌ ఒక్కగా నొక్క కుమారుడు. పండుగ కోసం వచ్చి మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబా లు శోకసంద్రంలో మునిగిపోయాయి. ము నిస్వామి, వీరేష్‌ ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవార ని చావులోనూ అలాగే వెళ్లారని రోదించారు.

రోడ్డు ఆక్రమణతోనే ప్రమాదాలు

ఎమ్మిగనూరు–కర్నూలు రోడ్డు గోనెగండ్లలో దాదాపు 80 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ రోడ్డులో నిత్యం వాహనాల రాక పోకలు సాగుతుంటాయి. అయితే, రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాదారులు తమ అంగళ్ల ముందు ఆనకట్ట మాదిరిగా ఎత్తుగాా మట్టి వేయడం, తోపుడు బండ్లు పెట్టడం చేస్తున్నారు. దీంతో 80 అడుగుల రోడ్డు కాస్త 20 అడుగుల రోడ్డుగా మారింది. దీంతో బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో తరచుగా ప్రమాదా లు జరుగుతున్నాయి. లారీ వేగంగా వచ్చినప్పుడు మునిస్వామి, వీరేష్‌లు పక్కకు వెళ్లడానికి స్థలం లేకపోవడం కూడా ప్రమాదానికి ఓ కారణమని స్థానికులు అంటు న్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని రోడ్డుకు ఆనుకొని వెలసిన ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

మృతిచెందిన మునిస్వామి, వీరేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement