దాతృత్వానికి ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

దాతృత్వానికి ప్రతీక రంజాన్‌

Mar 18 2026 7:47 AM | Updated on Mar 18 2026 7:47 AM

నంద్యాల(అర్బన్‌): పవిత్ర రంజాన్‌ మాసం దానధర్మాలకు, దాృత్వానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక జుమ్మా మసీదులో ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత ఇఫ్తార్‌ విందు స్వీకరించారు. రాష్ట్రం, దేశం, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక దువా చేశారు. అనంతరం శిల్పారవి మాట్లాడుతూ ముస్లింలు నెలరోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు ఉండి అల్లా స్మరణలో గడపడం విశేషమన్నారు.అంతేకాకుండా పేదలకు తమ వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

రంజాన్‌ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, నంద్యాలలో మతసామరస్యం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ముస్లిం బాలికల మదరసా అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేశారు.

ఇఫ్తార్‌ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement