కర్నూలు(సెంట్రల్): కల్లూరు, కోసిగి సబ్ రిజిస్ట్రా ర్లుగా ఎం.రాముడు, ఎం.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇందులో కల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చిన మద్దిరాముడు అవుకు, కోసిగి సబ్ రిజిస్ట్రార్‌గా వచ్చిన ఎం.శ్రీనివాసులు నంద్యాల డీఆర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసేవారు. వీరిద్దరికీ సీనియర్ అసిస్టెంట్ నుంచి సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిలో ఒకరిని కల్లూరుకు, మరొకరిని కోసిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కల్లూరు సబ్ రిజిస్ట్రార్ మంగళవారం బాధ్యతలు తీసుకొని విధులు నిర్వర్తించారు.
జాకెట్ తెచ్చిన తంటా
● ఘర్షణలో ఇద్దరికి గాయాలు
గుత్తి రూరల్: ఓ మహిళకు చెందిన జాకెట్ పక్కింట్లో కనిపించడంతో గొడవ చోటు చేసుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు.. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలోని శివాలయం వద్ద నివాసముంటున్న సుంకులమ్మ మంగళవారం ఉతికేసిన తన నాలుగు జాకెట్లను ఇంటి బయట ఎండలో ఆరవేసింది. అయితే అవి కనిపించకుండా పోయాయి. కాసేపటి తర్వాత ఆ జాకెట్లు పక్కింట్లో ఉన్న శాంతమ్మ, నందిని వద్ద కనిపించడంతో సుంకులమ్మ నిలదీసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సుంకులమ్మ సోదరులు లక్ష్మన్న, రాము అక్కడకు చేరుకుని సోదరి పక్షాన మాట్లాడారు. ఆ సమయంలో మాటామాట పెరగడంతో లక్ష్మన్న, రాముపై కర్రలు, ఇనుప రాడ్లతో శాంతమ్మ, నందిని, చిన్నవీరప్ప, ఉరుకుందు, చిన్ని, వంశీ దాడి చేసి గాయపరిచారు. ఘటనలో తలలు పగిలి తీవ్రంగా గాయపడిన లక్ష్మన్న, రామును వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన లక్ష్మన్న , రాము


