● అధికారపార్టీ నేతలు అక్రమంగా
గ్రావెల్ దందా
● చోద్యం చూస్తున్న అధికారులు
డోన్: అధికారపార్టీ నాయకులు బరితెగించారు. ఏకంగా కొండలు తవ్వి గ్రావెల్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందాను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. డోన్ మండలంలోని రేకులకుంట, వెంకటనాయునిపల్లె, మల్లెంపల్లె గ్రామ పరిసర ప్రాంతాల్లో కొండలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన వీటిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడింది. పగలు రాత్రి తేడాలేకుండా ఆ కొండలను ప్రొకై ్లన్‌లతో తవ్వి మొరుసు ట్రాక్టర్లలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, గృహనిర్మాణ అవసరాలకు, రైల్వే డబ్లింగ్ పనులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీల అనుమతులు, రెవెన్యూ అధికారుల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. ఇవేవి లేకుండా గ్రావెల్ అక్రమ త్రవ్వకం నిరాటకంగా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


