మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీరంగనాథస్వామి సోమవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా స్థానిక బావి వద్దకు తీసుకెళ్లి వసంతోత్సవం జరిపారు. ఈ సందర్భంగా యువకులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుంచారు. దేవాలయ ఆవరణలో పల్లకీ సేవ చేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఆలయ ఈఓ రెబ్బావీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, సభ్యులు రామయ్య, నరసింహులు, రంగస్వామి, భక్తులు పాల్గొన్నారు.


