సమస్యను రాసేవారు ‘లేఖ’..
సమస్యను పరిష్కరించేందుకు సూదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అర్జీ తయారీ కూడా సమస్యగానే మారుతోంది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకోక పోవడంతో చివరకు కలెక్టర్‌కు చెప్పుకోవాలని ఎంతో ఆశతో కలెక్టరేట్ చేరుకుంటారు. అయితే చాలా మంది నిరక్షరాస్యులు కావడంతో సొంతంగా వారు అర్జీ రాసుకోలేరు. వీరంతా పదో, పదిహేనో ఇచ్చి కలెక్టరేట్ వెలుపల, లోపల అందుబాటులో ఉండే లేఖరులతో తమ అర్జీలను రాయించుకోవాల్సి వస్తోంది.
అయితే కలెక్టర్‌గా డాక్టర్ ఏ.సిరి వచ్చిన తరువాత అర్జీలను లేఖరులకు బదులుగా అధికారులే రాసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక బయటి వ్యక్తులు ఎవరూ అర్జీలు రాకూడదని..కలెక్టరేట్‌లో ఉండకూడదని ఆదేశించారు. అయితే కొందరు అధికారులు అర్జీలు రాసి ఇవ్వకపోవడంతో ప్రజలు తమ అర్జీల కోసం కలెక్టరేట్ వెలుపల రోడ్లపైనే అర్జీలు రాయించుకుంటున్నారు. అటు ఇటుగా వాహనాలు వెళ్తున్నా అర్జీ రాయించుకోవడం కోసం రోడ్డుపైనే కూర్చోవాల్సి వస్తోంది. ఈ దృశ్యాలు ప్రజల సమస్యలకు అద్దం పడుతోంది. – కర్నూలు(సెంట్రల్)
సమస్యను రాసేవారు ‘లేఖ’..


