నయన మనోహరం.. రజిత రథోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజిత రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మౌని అమావాస్య కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా మంత్రాలయం వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ కుంకుమ ఆర్చన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం ప్రాంగణంలో చెక్క రథంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. భక్తుల మధ్య రజిత రథోత్సవం కనుల పండువగా సాగింది.


