ఐపీ భవనం పూర్తి చేయాలని కోరుతున్నాం
ఆసుపత్రిలో ఐపీ భవనం నిర్మాణం ఆగిపోవడంతో ఇబ్బందులు అంతా ఇంతా కాదు. దీనివల్ల అటు రోగులు, ఇటు వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ మెడిసిన్, సర్జికల్, డ్రగ్ స్టోర్, వాహనాల పార్కింగ్, ఆపరేషన్ థియేటర్లకు స్థలం లేక అవస్థలు పడుతున్నాం. ఐపీ భవనం పూర్తయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. భవనం పూర్తి చేయాలని ఆసుపత్రి, కళాశాలల్లో నిర్వహించే పలు సమావేశాలు, కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను కోరుతున్నాం.
– డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్,
జీజీహెచ్, కర్నూలు


