మహా‘నందీ’శ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వరస్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరస్వామికి శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో అభిషే కం పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అ ర్చకులు డి.సురేంద్రశర్మ, వేదపండితులు శాంతారాంభట్‌లు ముందుగా గణపతిపూజ, పుణ్యాహవచనం చేసిన తర్వాత పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, క్షీరాభిషేకం వైభవంగా చేపట్టారు. ప లు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవాటికెట్ల ద్వారా నందీశ్వరస్వామి ప్రదోష కాల అభిషేక పూజల్లో పాల్గొన్నారు.
మహానందిలో భక్తుల సందడి
మహానంది పుణ్యక్షేత్రంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా గత మూడు రోజుల నుంచి భక్తులరద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత, శీఘ్రదర్శనం, స్పర్శదర్శనం, క్షీరాభిషేకం, రుద్రాభిషేకం ఆర్జితసేవా టికెట్ల ద్వారా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు.


