ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలు పట్టవా?
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన బాట పడుతామని ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పి.కన్నన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సమావేశ భవనంలో డ్రైవర్స్ ఫెడరేషన్ సౌత్ వెస్ట్ జోన్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జాతీయ అధ్యక్షుడు కన్నన్ అధ్యక్షతన జరిగింది. ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కన్నన్, జాతీయ ప్రధాన కార్యదర్శి సత్పాల్ మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల చట్టబద్ధమైన డిమాండ్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేదన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విద్యార్హతలను బట్టి డ్రైవర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉన్నప్పటికి ఈ దిశగా ప్రభుత్వ చర్యలు లేవని తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా గవర్నమెంటు డ్రైవర్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రసిడెంట్‌లు జి.అబ్దుల్ హమీద్(కర్నూలు), రిజ్వాన్ అహ్మద్ సిద్దకి, సౌత్ వెస్ట్ జోన్ అధ్యక్షుడు అనిరుద్ధ టెహరా, మాజీ జాతీయ అధ్యక్షుడు రాంపర్ పాండే, జిల్లా నాయకులు రామ్‌గోపాల్, ఇలియాస్ బాషా, షబ్బీర్ బాషా, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
స్పందించకపోతే
ఆందోళన బాట తప్పదు
ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్
ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పి.కన్నన్


