విద్యాశాఖ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి
కర్నూలు సిటీ: విద్యాశాఖలో పని చేస్తున్న సర్వీస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యాశాఖ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు స్వాములు, రాష్ట్ర అధ్యక్షుడు పద్మావతి పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాఠశాల విద్యాశాఖ సర్వీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం శనివారం కర్నూలు డీఈఓ ఆఫీస్ మీటింగ్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగులపై పని భారం తగ్గించాలన్నారు. ఆ తరువాత జిల్లా పాఠశాల విద్యాశాఖ సర్వీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నుకునేందుకు ఏపీ ఎన్జీవోల సంఘం కర్నూలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలకు అధికారిగా బలరాం రెడ్డి వ్యవహారించారు. సమావేశంలో నూతన కార్యవర్గ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పి.లక్ష్మీ నర్సయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి, ప్రధాన కార్యదర్శిగా సి.రఘు, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, కోశాధికారిగా నవీన్ రెడ్డిని ఏగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్, సెక్రటరీ కాశన్న తదితరులు పాల్గొన్నారు.


