జిల్లా పోలీసు శాఖకు జాతీయస్థాయి అవార్డు
● రాష్ట్రంలోనే అత్యుత్తమ పీఎస్
పెద్దకడుబూరు
కర్నూలు: జిల్లా పోలీసు శాఖకు జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. నేరాల అదుపు, నేర నియంత్రణ, సీసీ కెమెరాల నిఘాతో కేసుల ఛేదన, దర్యాప్తు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసింది. దేశంలో పది పోలీస్‌స్టేషన్లు ఈ అవార్డుకు ఎంపిక కాగా రాష్ట్రం నుంచి పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌కు ఆ ఘనత దక్కింది. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా చేతుల మీదుగా శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడుబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డితో కలసి ఈ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని విక్రాంత్ పాటిల్ తెలిపారు.


