ధరల్లో తేడా
ఆదోని అర్బన్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వేరుశనగకాయల ధరల్లో తేడా కనిపిస్తోంది. కర్నూలు మార్కెట్‌యార్డులో క్వింటా గరిష్ట ధర రూ.8,800 ఉండగా ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డులో రూ.8,600 లభించింది. ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులకు కేవలం రూ.7,629 వచ్చింది. ఇక్కడ నలుగురు వ్యాపారుల ప్రభావంతో రైతులు నష్టపోతున్నట్లు కమీషన్ ఏజెంట్లు, చిన్న వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇలానే ధరలో కోతలు కోస్తే ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగకాయ మార్కెట్ నడిపించడం కష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వేలల్లో వేరుశనగ సంచులు వచ్చేవి. ప్రస్తుతం వందల్లో వస్తున్నాయి.


