గజ వాహనంపై దివ్య తేజం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో గురువారం రాత్రి గజవాహనంపై ప్రహ్లాదరాయలు ఊరేగారు. ‘పూజ్యాయ రాఘవేంద్రాయ..సత్యధర్మ వ్రతాయచా’ అంటూ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. మధ్వ కారిడార్, కల్పతరు క్యూలైన్‌లో భక్తుల రద్దీ కొనసాగింది.


