నేడు ఎపీఎన్‌జీజీవోస్ జిల్లా శాఖ ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్):ఏపీఎన్‌జీజీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, రమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలనే తాత్కాలికంగా అడ్‌హాక్ కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఎట్టకేలకు రెండు గ్రూపుల మధ్య రాష్ట్ర నాయకత్వం రాజీ కుదర్చడంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. అధ్యక్షుడిగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కార్యాలయంలో ఆఫీసు మేనేజర్ గా పనిచేస్తున్న జవహర్‌లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవసాయ శాఖ కర్నూలు ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంసీ కాశన్నలను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఏర్పడింది. పోటీ అనివార్యమైతే ఈనెల 16న జిల్లా కోర్టు ఎదుటనున్న జిల్లా ఎన్‌జీవో హోంలో శుక్రవారం ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు.
ఫిబ్రవరి 7న
నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 7న నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్‌గా పుట్టిన తేదిన ఉపయోగించి హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. 9వ తరగతికి https://cbseitms.nic.in/2025/ nvsix, 11వ తరగతికి https://cbseitms.nic.in/ 2025/nvsxi వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. సందేహాలుంటే 085212 –294545ను సంప్రదించాలని పేర్కొన్నారు.
‘చిన్న’బోతున్న
అంగన్‌వాడీ గుడ్లు
వెల్దుర్తి: అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్ల సై జు పూర్తిగా తగ్గిపోయింది. నాణ్యత, పరిమా ణంలో స్పష్టమైన నిబంధనలున్నా వెల్దుర్తి మండలంలోని అంగన్‌వాడీ సెంటర్లకు కాంట్రాక్టర్లు సరఫరా చేసే గుడ్ల సైజు పిట్ట గుడ్లను తలపిస్తున్నాయి. ఒక్కో గుడ్డు 30 గ్రాములను కూడా మించని పరిస్థితి. ఈ కారణంగా పిల్లలకు, గర్భిణీలకు నాణ్యమైన, పోషకాలున్న ఆహారం అందించాలన్న అంగన్‌వాడీల లక్ష్యం నీరుగారుతోంది. ఈ విషయంపై సీడీపీఓ లూక్‌ను వివరణ కోరగా తన దృష్టికి కూడా వచ్చిందని, ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు.
తలసీమియా రక్తమార్పిడి కేంద్రం ఏర్పాటు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆవరణలో గురువారం తలసీమియా బాధితులకు రక్తమార్పిడి కేంద్రం ప్రారంభమైంది. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి నెలా వంద మందికి పైగా తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తీసుకున్న రక్తాన్ని ప్రభుత్వ, ఇతర ఆసుపత్రుల్లో ఎక్కించేవారన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా రెడ్‌క్రాస్ సొసైటీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రక్తం ఎక్కించే ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, కాట్స్ దాత డాక్టర్ తిరుపాల్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ ట్రెజరర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
క్వింటా పత్తి రూ. 8,149
ఆదోని అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం పత్తి ధర రూ.39కి పెరిగింది. క్వింటాకు సీసీఐ గిట్టుబాటు ధర రూ.8110 ఉండగా మార్కెట్‌లో రూ.8149 పలికింది. అమ్మకానికి 2,097 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.8,149, మధ్య ధర రూ.7,469, కనిష్ట ధర రూ.4,279గా నమోదయ్యింది.
నేడు ఎపీఎన్‌జీజీవోస్ జిల్లా శాఖ ఎన్నికలు


