వైభవంగా మద్దమాంబ దేవర
మద్దికెర: మండల కేంద్రమైన మద్దికెరలో ప్రసిద్ధి చెందిన శ్రీ మద్దమాంబ అమ్మవారి దేవర మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. కవిరెడ్డి వీధి ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంభాలతో గ్రామ పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి భక్తులు చలువ కుండలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజలకు విచ్చేసిన ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
కుంభాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు


