పింఛన్ ‘అడుగు’తున్నాం.. కరుణించండి!
పింఛన్ కోసం యూరిన్ బ్యాగ్‌తో అడుగులు వేస్తూ కలెక్టరేట్‌కు వచ్చిన ఈయన పేరు జాకీర్‌బాషా. నందవరానికి చెందిన ఈయన గౌండ పని చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో నడుము కింద భాగం నుంచి అరికాళ్ల వరకు స్పందన లేకుండా పోయింది. ఖరీదైన(రూ.25 లక్షలు) ఆపరేషన్ చేయించుకుంటే సాధారణ స్థితికి రావచ్చని వైద్యులు చెప్పినా అంత ఆర్థికస్థోమత లేక వాకర్ సాయంతో యూరిన్ బ్యాగ్ కట్టుకొని అడుగులు ముందు వేస్తున్నాడు. కుటుంబ జీవనం కష్టతరమై పింఛన్ కోసం ఈయన దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాదిన్నరగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగతున్నా పింఛన్ మంజూరు కాలేదు. సోమవారం పింఛన్ కోసం వాకర్‌కు తన యూరిన్ బ్యాగ్ కట్టుకొని అడుగులు వేస్తూ మరోసారి కలెక్టర్‌ట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వచ్చాడు. తన దీనస్థితిని జిల్లా అధికారులకు వివరించి దరఖాస్తు చేశాడు. ఈ సారైనా ఆయనకు పింఛన్ మంజూరవుతుందోలేదో వేచి చూడాల్సిందే!
– కర్నూలు(సెంట్రల్)


