సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్‌లు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్‌లు

Jan 6 2026 7:21 AM | Updated on Jan 6 2026 7:21 AM

సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్‌లు

సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్‌లు

కర్నూలు(సెంట్రల్‌): రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించడం కోసమే రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి తెలిపారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ క్లినిక్‌లకు సంబంధించి ఏర్పాటు చేసిన తొమ్మిది కౌంటర్లను సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులు, స్వీకరిస్తున్న తీరు, రిజిస్ట్రేషన్‌ విధానాలను అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ ఉన్నారు.

అర్జీలను గడువులోపు పరిష్కరించాలి

పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలసి అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌ను త్వరగా పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement