ప్రయోగాత్మక విద్యతో మెరుగైన ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ప్రయోగాత్మక విద్యతో మెరుగైన ఫలితాలు

Dec 21 2025 9:32 AM | Updated on Dec 21 2025 9:32 AM

ప్రయో

ప్రయోగాత్మక విద్యతో మెరుగైన ఫలితాలు

జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో 159 ప్రాజెక్టులు ప్రదర్శన

ప్రాజెక్టుల తయారీపై దృష్టి పెట్టని విద్యా శాఖ

నామమాత్రంగా ప్రాజెక్టుల తయారీ

సైన్స్‌ టీచర్లపైనే ప్రాజెక్టుల తయారీ భారం

వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి

కర్నూలు సిటీ: పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాత్మక విద్యతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిలా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సి.వి.రామన్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను కలెక్టర్‌ ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన 11మంది విద్యార్థులు ఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై య్యారన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన చిన్న చిన్న ప్రాజెక్టులే రేపటి రోజున పెద్ద ఆవిష్కరణలకు నాంది అన్నారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా అపారమైన ప్రతిభ ఉంటుందని.. సరైన అవకాశాలు, మార్గదర్శకం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు.

వ్యక్తిగత విద్యార్థి విభాగం

1.ఎ.సురేఖ(ఉపరితలం వైశాల్యం, ఘన పరిమాణాం), డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల, కంబాలపాడు

2. మేఘన(బహుభుజి యొక్క బాహ్యకోణాల మొత్తం), జడ్పీ హైస్కూల్‌, హెచ్‌.కై రవాడి, గోనెగండ్ల మండలం

వ్యక్తిగత ఉపాధ్యాయ విభాగం

1.పి.లింగరాజు(వాయు కాలుష్య నియంత్రణ), స్కూల్‌ అసిస్టెంట్‌ బయాలజీ టీచర్‌, ఉరుకుంద జెడ్పీ హైస్కూల్‌

2.వై.అనురాధ(సమీకృత వ్యవసాయ విధానం), జెడ్పీ హైస్కూల్‌, కోసిగి

ప్రదర్శనను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించిస్తున్న కలెక్టర్‌ డా.ఎ.సిరి, ప్రదర్శనలను తిలకిస్తున్న జిల్లా కలెక్టర్‌ డా.ఎ.సిరి, డీఈఓ ఎల్‌.సుధాకర్‌

వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది

రాష్ట్ర స్థాయికి 11 ప్రాజెక్టులు ఎంపిక

జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మొత్తం 159 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందులో 11 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు.

1.సుస్థిర వ్యవసాయం–బి.ఆసిఫ్‌, ఎం.అనాస, నందవరం జెడ్పీ హైస్కూల్‌

2.వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలు–కె.మల్లికార్జున(పాల ప్లాస్టిక్‌), ఏపీ మోడల్‌ స్కూల్‌ గోనెగండ్ల

3. హరిత శక్తి–పి.మానస, టి.గ్రేస్‌మేరి(హరిత హైడ్రోజన్‌–భవిష్యత్‌ ఇంధనం), డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల, దిన్నెదేవరపాడు

4. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు– పి.లత్తీఫ్‌, పి.రోషన్‌(వాక్యుమ్‌ క్లీనర్‌), జెడ్పీ హైస్కూల్‌, హంప, మద్దికేర మండలం

5.గణిత నమూనాలు–ఎస్‌.రెహానా, భార్గవి(త్రిముఖ నమూనాలు)ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ హైస్కూల్‌, వెల్దుర్తి

6.ఆరోగ్యం, పరిశుభ్రత–బి.రితిక, తేజేశ్వని(డ్రాప్‌ మైక్రోస్కోప్‌)ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, కింగ్‌ మార్కెట్‌, కర్నూలు

7. నీటి సంరక్షణ, నిర్వహణ–కె.వైష్ణవి(సుస్థిర వ్యవసాయంలో నీటి సంరక్షణ), జెడ్పీ హైస్కూల్‌ ఉరుకుంద, కౌతాళం మండలం

ప్రయోగాత్మక విద్యతో మెరుగైన ఫలితాలు 1
1/1

ప్రయోగాత్మక విద్యతో మెరుగైన ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement