శ్రీమఠంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌

Dec 21 2025 9:32 AM | Updated on Dec 21 2025 9:32 AM

శ్రీమఠంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌

శ్రీమఠంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌

మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాన్ని రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ జానకిరామన్‌ సతీసమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌కు శ్రీ మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట ఆర్‌ఎం శ్రీనివాస్‌, డీజీఎం వి.హేమ ఉన్నారు. శ్రీమఠం అధికారులు శేష వస్త్రం, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్ర జ్ఞాపిక అంజేశారు. స్థానిక స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను (ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్‌ సందర్శించారు. ప్రజలకు బ్యాంకు సేవలు ఉపయోగం గురించి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement