సీసీఐ కేంద్రాల్లో ‘ధర’ దగా!
గూడూరు మండలం పెంచికలపాడులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో ఇటీవల 16 వాహనాల పత్తిని తేమ, రంగు లేదని తిరస్కరించారు. ఇందులో కల్లూరు పర్ల గ్రామానికి చెందిన ఓ రైతు దిగుబడులు ఉన్నాయి. పత్తిని ఇంటికి తీసుకెళ్ల లేక ఆ రైతు క్వింటా రూ.6,800 ప్రకారం దాదాపు 100 క్వింటాళ్ల పత్తిని దళారికి విక్రయించాడు. ఇదే పత్తిని అదే రైతు పేరుతో స్లాట్ బుక్ చేసి బొలెరో వాహనాల ద్వారా దళారి లోపలికి పంపారు. మొదట తిరస్కరించిన వారు దళారి పంపితే క్వింటాకు రూ.7,900 ధర ఇచ్చారు. దీంతో క్వింటాపై రూ.1,100 లాభం పొందారు. ఇలా రూ.1.10 లక్షలు సంపాదించారు. ఇందులో సగం వరకు అధికారులకు వాటా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
... ఇటువంటివి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతున్నాయి.
పెచ్చుమీరిన దళారుల దందా
అధికారులతో కుమ్మక్కు
తక్కువ ధరతో కొనుగోలు
రైతుల పేర్లతోనే స్లాట్‌లో బుకింగ్
తిరస్కరించిన పత్తినే
కొనుగోలు చేస్తున్న వైనం
దళారులంతా టీడీపీ మద్దతు దారులు


