పసిమొగ్గకు ‘రూ.16 కోట్ల’ కష్టం
వెల్దుర్తి: పసిమొగ్గకు ఒక్కసారిగా రూ.16కోట్ల కష్టం వచ్చి పడింది. ఎనిమిది నెలలు నిండిన చిన్నారి రెండేళ్లకు మించి బతకని రుగ్మత వచ్చింది. బతకాలంటే రూ.16కోట్ల ఇంజక్షన్ అవసరమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన జెఎమ్ సురేష్, పుష్పావతి కుమార్తె పునర్విక శ్రీ శరీరాన్ని కదపలేని స్థితిలో, ఏడవాలన్నా, నవ్వాలన్నా, చివరికి ఊపిరికై నా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించగా ఎస్‌ఎమ్‌ఏ టైప్ వన్(స్పైనల్ మస్స్క్యులర్ ఆత్రఫి–జన్యు సంబంధిత వెన్నముక కండరాల క్షీణత)రుగ్మత అని తేలింది. ఈ వ్యాధి చికిత్సకు రూ.16కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులు చెప్పారు. వెల్దుర్తి కొత్త బస్టాండు ప్రాంతంలో ఓ చిన్న షాపులో కులవృత్తి మంగలి పనితో జీవనం సాగించే సురేష్ (ఫోన్ నంబర్ 9052635529) దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఇంజక్షన్ కొనుగోలు చేసేందుకు 14 నెలల్లోనే డబ్బు సమీకరించుకోవాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించాలని సురేష్ కోరుతున్నారు.


