శ్రీమఠం.. భక్త జనసంద్రం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. చలిని సైతం లెక్క చేయకుండా తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. మార్గశిర అరుద్ర నక్షత్రం సందర్భంగా గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. అమ్మవారికి ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు రథంపై ప్రహ్లాదరాయులు వైభవంగా విహరించారు. కల్పతరు క్యూలైన్‌లో భక్తుల రద్దీ కొనసాగింది.
– మంత్రాలయం రూరల్
శ్రీమఠం.. భక్త జనసంద్రం


