రెడ్డప్ప.. నిను మరువలేం!
జవహర్ నవోదయ విద్యాలయం మొదటి ప్రిన్సిపాల్ దివంగత ఎస్‌వి రెడ్డప్ప విగ్రహాన్ని ఆయ న సతీమణి లలితమ్మ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. రాజంపేట జిల్లా జడ్జి ప్రవీణ్‌కుమార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామకృష్ణయ్య, ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి హాజరయ్యారు. నవోదయ విద్యాలయంలో నిర్వహించిన అపూర్వ సమ్మేళనంలో 1986 సంవత్సరం నుంచి చదువుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ చుదువుకుని చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. –ఎమ్మిగనూరురూరల్


