మహిళలకు అండగా లీగల్ సర్వీసెస్ అథారిటీ
కర్నూలు: నేటి సమాజంలో సీ్త్రలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషాద్రి అన్నారు. మంగళవారం కేవీఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సీ్త్ర హింస వ్యతిరేక దినం నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి, రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ రూఖయ్య బేగం హాజరయ్యారు. సదస్సులో వెంకటశేషాద్రి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, హింసపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడమే సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు వస్తే 15100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామ న్నారు. ఏపీ మహిళా కమిషన్ మెంబర్ రూఖయ్య బేగం మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ మహిళల కోసం ఏర్పా టు చేసిన ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ 14490కు కాల్ చేస్తే వారికి తగిన సహాయం అందిస్తామని చెప్పారు. మహిళా పీఎస్ సీఐ విజయలక్ష్మి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది సులోచ న, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగారెడ్డి, మహిళా సాధికారత సెల్ అధ్యాపకురాలు డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు.


