వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏకగ్రీవ ఎన్నిక
నంద్యాల(అర్బన్): రుద్రవరం మండలం మాచినేనిపల్లి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార సమితి డైరెక్టర్ల ఎన్నికలో వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈనెల 24వ తేదీన మాచినేనిపల్లి సహకార సమితి డైరెక్టర్ల పదవులకు నిర్వహించిన ఎన్నికకు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, జల్లయ్య మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్లలో ఎటువంటి తప్పిదా లు లేకపోవడం, ఎవరూ అభ్యంతరం తెలపకపోవడంతో డైరెక్టర్లుగా ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, జల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఫారం–7 డిక్లరేషన్‌ను ప్రతిని సమితి కార్యాలయానికి సిబ్బంది అతికించారు. ఇద్దరు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల పాల ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేశారు.


