సీఎంటీఐతో ఐఐఐటీడీఎం ఒప్పందం
కర్నూలు సిటీ: డిజైన్ మరియు తయారీ, ఇంజినీరింగ్, ఇతర అధునాతన సాంకేతిక రంగాల్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కోసం సెంట్రల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (సీఎంటీఐ) బెంగళూరుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) అవగాహన ఒప్పందం చేసు కున్నాయి. మంగళవారం ట్రిపుల్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీడీఎం డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి, సీఎంటీఐ డైరెక్టర్ నాగహనుమయ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమ, విస్తృత తయారీ రంగానికి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా సీఎంటీఐతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీడీఎం మెకానికల్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ అక్తర్ ఖాన్, మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ఆనంద్ కుమార్ ట్రిపుల్ ఐటీడీఎం రిజిస్ట్రార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


