పర్యాటక కేంద్రంగా గాజులదిన్నె
గోనెగండ్ల: జిల్లాలో ఏకై క మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు అయిన గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు ప డుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఏపీ టూరి జం శాఖ ఏఈ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వేయర్లు సాజీత్, సుధారాణిలు జీడీపీలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేదుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఎకరా స్థలంలో చిన్న పిల్లలకు పార్కు, రెస్టారెంట్, అలాగే పర్యాటకులు, వికలాంగుల కోసం బాత్రుమ్‌లు ఏర్పాటుకు సర్వే చేస్తున్నామని తెలిపారు. సర్వే చేసిన ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.


